ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్ : ఇంటర్ మీడియట్ బోర్డు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈసారి ఉత్తీర్ణత శాతంలో బాలికలే అగ్రస్థానం సాధించారు. బాలురు 44.11 శాతం సాధించగా, బాలికలు 49.79 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల వారీగా ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను పరిశీలిస్తే కృష్ణా జిల్లా లో విద్యార్థినీ, విద్యార్థులు 63 శాతంలో అగ్రస్థానంలో ఉన్నారు. మహబుబ్ నగర్ జిల్లా మాత్రం 29 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఇంటర్ పరీక్షలకు 8.22 లక్షల మంది హాజరుకాగా 3.74 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కాగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను 24న విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యామండలి తెలిపింది.
News Posted: 17 April, 2009
|