హైదరాబాద్ : నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మార్చి 23 నుండి సెలవులు ప్రకటించినా దాన్ని పట్టించుకోకుండా వేసవిలో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తరగతులు ఎందుకు నిర్వహిస్తున్నారని కళాశాలలకు వెళ్ళి అడిగితే రౌడీలతో దాడులు చేయిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.