హైదరాబాద్ : హైదరాబాద్ లోని జియా గూడలో ఓ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా అశోకుడి కాలం నాటి హనుమాన్ విగ్రహం లభ్యమైంది. తవ్వకాల్లో లభ్యమైన హనుమాన్ విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా సందర్శకులతో కిటకిటలాడింది. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు విగ్రహాన్ని తరలించ ప్రయత్నించగా జనం అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళన కారులపై లాఠీ చార్జ్ చేయటంతో స్థానికులు వారిపై రాళ్ళు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.