కింగ్ ఫిషర్ ఉద్యోగుల ధర్నా
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. కింగ్ ఫిషర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వంటం లేదనీ, తమతో ఎక్కువ సమయం పని చేయించుకుని తక్కువ వేతనాలు ఇస్తున్నారనీ వారు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 500 మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో కింగ్ ఫిషర్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
News Posted: 22 April, 2009
|