ఆర్టీసీ ప్రయాణీకులకు శుభవార్త
హైదరాబాద్ : ప్రయాణాల రద్దీ ఎక్కువుగా వుండే వేసవిలో ఆర్టీసీ ఒక ప్రత్యేక నెంబర్ ను ఏర్పాటు చేసింది ప్రయాణీకుల సౌలభ్యం కోసం. ఆర్టీసీ బస్సుల వివరాలు, రిజర్వేషన్ల గురించి తెలుసుకోవడానికి వాడే హెల్ప్ లైన్ నెంబరు కలటం దాదాపు అసాధ్యం. ఇక అలాంటి ఇంబంధులన్నీ దూరం కానున్నాయి. ప్రయాణీకులకు వెంటనే వివరాలు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సౌజన్యంతో ఆర్టీసీ ప్రత్యేక నెంబరును ఏర్పాటు చేసింది. ల్యాండ్ లైన్ ద్వారా 12666 కు డయల్ చేస్తే బస్సు స ర్వీసుల వివరాలను, రిజర్వేషన్ వివరాలను తలుసుకోవచ్చని రంగారెడ్డి రీజియన్ మేనేజర్ రవీంద్ర బాబు తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాళ్లోని బస్ స్టేషన్ లో వివరాలకోసం ఆయా ప్రాంతాల ఎస్టీడీ కోడ్ ను ముందుగా డయల్ చేసి తర్వాత 12666 నెంబర్ కి డయల్ చేస్తే బస్స్ రిజర్వేషన్ తదితర వివరాలను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.
News Posted: 22 April, 2009
|