హైదరాబాద్ : స్థానిక మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లో గత రాత్రి వివిధ జిల్లాలకు ఓట్లు వేసేందుకు వెళ్ళే వారితో కిటకిటలాడింది. భారీ సంఖ్యలో ఇక్కడి నుంచి ఓటర్లు తరళి వెళ్ళారు. అయితే బస్సులు సరిపడ లేక గంటల తరపబడి ప్రయాణీకులు వేచి ఉండాల్సి రావటంతో ప్రయాణీకులు తాము ఓట్లు వేయకుండా తిరిగి వెళ్లేది లేదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారి. స్టేషన్ మేనేజర్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.