సెకండ్ ఇంటర్ ఫలితాలు
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను శుక్రవారం 11.30 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు సంయుక్త కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి లోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాల కోసం కాల్ సెంటర్ (ఈ-సేవ) నుంచి రాష్ట్రంలో ఏ బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ద్వారా 1100కు డయల్ చేసి తెలుసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ సెటర్ల నుంచి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఐవీఆర్ఎస్ ద్వారా బీఎస్ఎన్ఎల్ ఫోన్ నె.1255225 (హైదరాబాద్), 22222222లు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
News Posted: 24 April, 2009
|