కుటుంబంపై యాసిడ్ దాడి
హైదరాబాద్ : ఇల్లు ఖాళీ చేసే విషయంలో ఇంటి యజమానికీ, అద్దెకు ఉన్నవారికీ మధ్య జరిగిన వివాదం చివరకు యాసిడ్ దాడికి దారితీసింది. హైదరాబాద్ లోని జియాగూడలో ఈ సంఘటన జరిగింది. ఆటో డ్రైవర్ గా పని చేసే ఓ వ్యక్తిని ఇల్లు ఖాళీ చేయమని ఆ ఇంటి యజమాని చెప్పగా అతను నిరాకరించాడు. దాంతో ఇంటి యజమాని ఆటో డ్రైవర్ కుటుంబంపై యాసిడ్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురు గాయపడగాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News Posted: 25 April, 2009
|