రైల్వే టికెట్ కలెక్టర్ల ధర్నా
హైదరాబాద్ : పనిభారం పెరిగిపోయిందని, పని గంటలను తగ్గించాలంటూ రైల్వే టిక్కెట్ కలెక్టర్లు గురువారంనాడు ధర్నాకు దిగారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో టిటిఈలు తమపై పనిభారం తగ్గించాలంటూ ఆందోళన చేపట్టారు. దీనితో సికింద్రాబాద్ స్టేషన్ లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. పని గంటలను తగ్గించే వరకూ తాము ఆందోళన విరమించేది లేదంటూ టిటిఈలు హెచ్చరిస్తూ నినాదాలు చేస్తున్నారు.
News Posted: 30 April, 2009
|