ప్రయాణీకులకు వేసవి తాకిడి
హైదరాబాద్ : పరీక్షలన్నీ ముగిసి సెలవులు మొదలు కావడంతో ప్రత్యేకించి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా ఉండడంతో బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసి పోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అవి ఏ మూలకూ చాలకపోవడంతో పాటు తత్కాల్ కిందే ఎక్కువ టిక్కెట్లు కేటాయిస్తుండడంతో ప్రయాణీకులు నానా పాట్లు పడుతున్నారు. స్టేషన్లలో, రైళ్లలో సౌకర్యాలు కరువైనాయి. రాజధానిలో ప్రయాణీకుల రద్దీ పెరగడంతో నాసిరకం ఆహారంతో సరిపెట్టుకోక తప్పడం లేదు. ఓ పక్క మండే ఎండలూ, సరైన ఆహారం లేక ప్రయాణీకులు నానా ఇక్కట్లు పడుతున్నారు.
News Posted: 30 April, 2009
|