ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి
హైదరాబాద్ : ముందు వెళుతున్న ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ మరో లారీని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం నారపల్లి వద్ద ఈ ప్రమాదం గురువారం ఉదయం జరిగింది. సివిఎస్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న క్రాంతి, సూరజ్ అనే ఈ ఇద్దరు విద్యార్థులు గురువారం ఉదయం బైక్ పై కళాశాలకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
News Posted: 30 April, 2009
|