హైదరాబాద్ : నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో గురువారం అర్థరాత్రి మంటలు రేగాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భోలక్ పూర్ బాధితులు ఉన్న వార్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతో అప్రమత్తమైన సిబ్బంది రోగులను వేరే వార్డులోకి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.