హైదరాబాద్ : మలక్ పేటలోని శంకర్ నగర్ లో కలుషిత నీరు తాగి పదిమంది అస్వస్థతకు గురైయ్యారు. మంచినీరు సరఫరా అయ్యే కుళాయిలలో మురికి నీరు వస్తుందని స్థానికులు ఆరోపించారు. భోలక్ పూర్ ఘటన మరువక ముందే ఇటువంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అస్వస్థతకు గురైన బాదితులు చికిత్స పొందుతున్నారు.