హైదరాబాద్ : వనస్థలిపురం షనామా గిడ్డంగి వద్ద ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా దారిన వెళ్ళే కార్లపై దూసుకుపోయింది. దీంతో కారులోని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసి బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయి ఎనిమిది కార్లపైకి దూసుకుపోయిన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి విషయమంగా ఉంది. బస్సు ఎన్జీవో కాలనీకి వస్తుండగా ఈ సంఘటన సంభవించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.