హైదరాబాద్ : కూకట్ పల్లిలో ఓ బ్యాంక్ నుండి డబ్బు డ్రా చేసుకుని వెళ్తున్న వ్యక్తి నుండి రూ. రూ.3 లక్షలను అపహరించారు. వివేకానంద కాలనీలోని ఆంధ్రాబ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకొని వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకిం దిగి నిందితుల కోసం గాలిస్తున్నారు.