జగన్ కోసం 'సాక్షి' ధర్నా
హైదరాబాద్ : డిజీపీ కార్యాలయం ఎదుట 'సాక్షి' సిబ్బంది ఈ రోజు ధర్నా చేశారు. పోలీసులు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి వై.ఎస్. జగన్ పై అక్రమ కేసులు బనాయిస్తూ వేదిస్తున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో గుంటూరు జిల్లా నర్సరావుపేట పోలీసులు జగన్ పై కేసు నమోదు కావడంతో వారు పై విధంగా స్పందించారు. జగన్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డు పై బైఠాయించిన జర్నలిస్టులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
News Posted: 12 May, 2009
|