సివిల్ ర్యాంకర్ కు ప్రశంస
హైదరాబాద్ : కృషి, పట్టుదల ఉంటే అంగ వైకల్యం ఎంతమాత్రమూ అడ్డు రాదన్న విషయాన్ని బుడిగి శ్రీనివాసులరెడ్డి మరోసారి నిరూపించారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సివిల్ సర్వీస్ పరీక్షలో 586వ ర్యాంకు సాధించిన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీనివాసుల రెడ్డి మంగళవారం నాడు ఎన్టీ ఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, శ్రీనివాసుల రెడ్డిని ఆదర్శంగా తీసుకొని యువత విజయాలు సాధించాలని కోరారు. సాధారణ ఉపాధ్యాయుడైన శ్రీనివాసుల రెడ్డి దృష్టి లోపం ఉన్నా కష్టపడి పట్టుదలతో అఖిల భారత స్థాయి సివిల్ పరీక్షలో కృతార్ధుడు కావడం హర్షించదగ్గ విషయం అని కొనియాడారు.
News Posted: 12 May, 2009
|