పాలిటెక్న్ లో బాలికల హవా
హైదరాబాద్ : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష సీప్-2009 ఫలితాలను రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాదాయ శాఖ మంత్రి ఆర్. చెంగారెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు లక్షా 95 వేల మంది హాజరుకాగా లక్షా 54 వేల 328 ఉత్తీర్ణత పొందారు. కాకినాడకు చెందిన ఎం.ఎస్.ఆర్కే తేజ ప్రధమ స్థానం సాధించగా, రాధేశ్యామ్ ద్వితీయ స్థానం సాధించారు. తణుకుకు చెందిన రమ్యశ్రీ, సత్య రాఘవ అనీష్, ఎం.శ్వేత, రాజేష్ కుమార్, హైదరాబాద్ కు చెందిన శివసాయి మోహన విరించిలు ద్వితీయ స్థానం పొందారు. ఉత్తీర్ణతా శాతం 81.8 శాతం కాగా అందులో 86.97 శాతం ఉత్తీర్ణత సాధించి బాలికలు ముందంజలో ఉన్నారు. 79.22 శాతం ఉత్తీర్ణతను బాలురు సాధించారు. గత ఏడాది బాలుర విజయశాతం ఎక్కువగా వుంటే ఈ ఏడాది బాలికలే పై చేయి సాధించారు.
News Posted: 13 May, 2009
|