హైదరాబాద్ : ఫలక్ నుమా బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో నిల్వ వుంచిన కలప అగ్ని కి ఆహుతైంది. యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో వారు రంగంలోకి దిగి మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు.