ఇల్లు గుల్ల
హైదరాబాద్ : పటాన్ చెరులో ఓ కుటుంబం పెళ్ళికి వెళ్ళి వచ్చేలోగా ఇల్లు గుల్లయిన సంఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు తలుపులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించి లక్షరూపాయల నగదు, 50 తులాల బంగారాన్ని దోచుకెళ్ళారు. స్థానికంగా నివసించే రాజయ్య కుటుంబం సంగారెడ్డిలో ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి ఇల్లు ఖాళీ అయి వుండడంతో పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఇటీవలే డబ్బును, నగలను బ్యాంకు నుంచి తీసుకువచ్చామనీ, ఈ విషయం తెలిసినవారే దొంగతానికి పాల్పడి వుంటారని రాజయ్య అనుమానాన్ని వ్యక్తం చేశారు. పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News Posted: 15 May, 2009
|