20న ఇంటర్ సప్లిమెంటరీ
హైదరాబాద్ : ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 102 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30గంటలకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్ అడ్వాన్స్ డు పరీక్షల సందర్భంగా ప్రత్యేక అదనపు బస్సుల్ని నడుపుతున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయశంకర్ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయానికి అరగంట ముందే చేరుకునేలా బస్సుల నిర్వహణ ఉంటుందన్నారు. పరీక్ష ముగిసిన వెంటనే తిరుగు ప్రయాణానికి అవి సిద్దంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మార్గమధ్యలో ప్రధాన ప్రాంతాల వద్ద డిపో మేనేజర్లు, సూపర్ వైజర్లు అందుబాటులో వుంటారని ఆయన వివరించారు.
News Posted: 19 May, 2009
|