హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం లో హాస్టళ్లలో వుంటున్న విద్యార్థులకు ముందస్తు సమాచారం అందించ కుండా విద్యార్థులు హాస్టల్స్ ను ఖాళీ చేయాలన్నఅధికారుల నిర్ణయం తో వారు ఆందోళనకు దిగారు. విద్యార్థులు వుంటున్న హాస్టల్స్ గదుల తాళాలను పగలగొట్టి వారి వస్తులను బయట పడేయడంతో అధికారుల తీరును నిరసిస్తూ కోపోద్రిక్తులైన విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు.