`భవిష్యత్ తెదేపాదే'
మిచిగాన్: అధికారంలోకి తిరిగి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నారై టిడిపి మిచిగాన్ కమిటీ అభినందనలు తెలియచేసింది. ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో, ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తూ కేంద్రం లో యు.పీ.ఏ ప్రభుత్వంపైన వున్న సానుకూలత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలించినట్లు అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యర్దుల అణచివేత, ఎదురుదాడి వంటి వ్యూహాలను వదులుకోవాలని సూచించింది.
ఏది ఏమైనా, ప్రజలు తెలుగుదేశం పార్టీ మాత్రమే బలమైన ప్రత్యామ్నాయంగా సూచిస్తూ, సెంటిమెంట్ పేరుతో చేసే బ్లాకుమెయిల్ రాజకీయాల్ని, మార్పు పేరుతో సృష్టించిన గందరగోళానికి సరిఅయిన సమాధానం ఇచ్చారని తెలియచేసింది. ఇక లెక్కకు మిక్కిలి హామీలను కూడా ప్రజలు ఆశించలేదు, విశ్వసించలేదు అని వెల్లడి అయ్యిందని అభిప్రాయపడింది.
తిరిగి జవసత్వాలను కూడకట్టుకున్న తెలుగుదేశం పార్టీ సమయానుకూలంగా, ప్రజసమస్యలపైన వుద్యమిస్తూ, ప్రజలకి మరింత చేరువవుతుందనీ, నాయకత్వం పార్టీని కొత్త తరహాలో ముందుకు తీసుకొని వేల్లుతుందనీ, భవిష్యత్ తెలుగుదేశం పార్టీదేననీ విశ్వాసం వేల్లిబుచ్చింది. ఈ దిశలో పార్టీ నాయకత్వానికి తమ సంపూర్ణ సహకారం వుంటుందనీ తెలియచేసింది.
News Posted: 19 May, 2009
|