రాముడు కుటుంబానికి బాబు సాయం
హైదరాబాద్ : ఆత్మహత్యకు పాల్పడిన పార్టీ అభిమాని కుటుంబానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అభిమాని కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని వెల్లడించారు. ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవడాన్ని తట్టుకోలేక గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాద్ వద్ద 25 ఏళ్ళ అభిమాని మల్లిశెట్టి రాముడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాముడు ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం కలవల్లకు చెందిన లారీ క్లీనర్. కాగా, ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో అమీనాబాద్ లోని జోసిల్ కంపెనీకి లోడు తీసుకువచ్చి, కంపెనీలోని చెట్టుకే ఉరివేసుకున్నాడు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్న తన కోరిక నెరవేరకపోవడంతోనే తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి రాముడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News Posted: 21 May, 2009
|