హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి శుక్రవారంనాడు బాంబు బెదరింపు వచ్చింది. దీనితో రోగులు భయంతో బయటికి పరుగులు తీస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది కూడా రోగులను ఆస్పత్రి నుంచి బయటికి పంపిస్తున్నారు. బాంబు డిస్పోజబుల్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో బాంబు ఉన్నట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ఆగంతకులు ఫోన్ చేశారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చేరుకొని సమాచారం చెప్పారు. వెంటనే తనిఖీలు నిర్వహిస్తున్నారు.