టిడిపిపి నాయకుడిగా నామా
హైదరాబాద్ : లోక్ సభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకునిగా ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎన్నికైన నామా నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టిడిపి అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన సమావేశంలో టిడిపి తరఫున లోక్ సభకు ఎన్నికైన ఆరుగు సభ్యులు నామా నాగేశ్వరరావు, కొనకళ్ళ నారాయణ, ఎం.వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ ఎన్. శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప, రోథోడ్ రమేష్, రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ నేత డాక్టర్ ఎం.వి. మైసూరారెడ్డి, సభ్యుడు నందమూరి హరికృష్ణ పాల్గొని నామాను నాయకుడిగా ఎన్నుకున్నారు. లోక్ సభలో నామా నాగేశ్వరరావు నాయకుడిగా కూడా వ్యవహరిస్తారు.
News Posted: 22 May, 2009
|