హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ బస్టాండ్ లో శనివారం ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగ్ నుంచి అయిదు లక్షలు విలువచేసే ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. దాంతో బాధితురాలు మారేడుపల్లి పోలీసులను ఆశ్రయించింది. అయితే కేసు నమోదు చేసుకునేందుకు వారు నిరాకరించినట్లు సమాచారం.