ట్రాఫిక్ జాం
హైదరాబాద్ : చౌటప్పల్ వద్ద తెల్లవారుజామున జరిగిన యాక్సిడెంట్ వల్ల జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై యాసిడ్ ట్యాంకర్, లారీనీ ఢీ కొనడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించడానికి గంటలకొద్దీ సమయం పట్టడంతో ట్రాఫిక్ జాం నెలకొంది.
News Posted: 23 May, 2009
|