ఎన్టీఆర్ కు నివాళి
హైదరాబాద్ : మహానటుడు, టిడిపి వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 86వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, కూతరు భువనేశ్వరి, అల్లుడు నారాచంద్రబాబునాయుడు, మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇతర మనవళ్లు, మనవరాళ్లు పుష్పగుచ్చాలు ఉంచి ఆయనకు నివాళులు అర్పించారు. లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ సందర్శించి ఆయనకు నివాళలు అర్పించారు.
News Posted: 28 May, 2009
|