హైదరాబాద్ : ప్రజారాజ్యం వల్ల టిడిపి ఓడిపోయిందని చెబుతున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాటల్ని సిపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. పిఆర్పీ వల్ల టిడిపికి ఓట్లు తగ్గలేదన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆమాత్రం సీట్లైనా రావడానికి సిపిఐ పార్టీయే కారణమని నారాయణ అన్నారు. పిఆర్పీ వల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని చంద్రబాబు అనడం సమంజసంగా లేదని ఆయన అన్నారు.