ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్
హైదరాబాద్ : రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలచేసింది. నూజివీడు, బాసర, ఇడుపుల పాయల్లో ని ఐఐఐటీలకు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ శనివారం విడుదల చేశారు. 900 సీట్లను ఓపెన్ కేటగిరికి కేటాయించగా, 5100 సీట్లను గ్రామీణ విద్యార్థులకు కేటాయించారు. పదో తరగతి మార్కుల ఆధారంగానే విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు. జూన్ 8 నుండి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కేసీ రెడ్డి తెలిపారు. ప్రతి మండలంలో కనీసం ఒకరికైనా అడ్మిషన్ లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
News Posted: 30 May, 2009
|