హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళగిరిలోని ఓ స్పిరిట్ కంపెనీలో ఈరోజు మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 20 వేల స్పిరిట్ అగ్నికి ఆహుతయినట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న మూడు అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూటే వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.