సిఎమ్ కు అభినందనలు తెలిపి శారద
హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సినీనటులు శారద, శ్రీహరి కలుసుకుని అభినందనలు తెలిపారు. దేశంలోనే తొలిసారి ఓ మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వడం గొప్ప విషయమని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోం శాఖకు మహిళను ఎంపిక చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని శారద తెలిపారు. ఈ సందర్భంగా నటుడు శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని తాను ముందుగానే చెప్పానని తన మాట నిజమైందన్నారు.
News Posted: 2 June, 2009
|