పిఆర్పీ ఎమ్మెల్యేలకు కోచింగ్
హైదరాబాద్ : తొలిసారిగా బుధవారం అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న పిఆర్పీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ప్రజారాజ్యం పార్టీ నిర్వహిస్తోంది. శాసనసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు వీరంతా శాసనసభా మాజీ కార్యదర్శి సదాశివరెడ్డి ఆధ్వర్యంలో శిక్షణా పొందడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అధ్యక్షతన సమావేశమైన పార్టీ సభ్యులు అసెంబ్లీలో చర్చించాల్సిన విధానాలు, అంశాలు, వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రజాసమస్యలపై విపక్షాలతో కలసి ప్రజారాజ్యం పోరాడుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే వంగా గీత తెలిపారు. ఈ కార్యక్రమానికి కోటగిరి విద్యాధరరావు, దేవేందర్ గౌడ్, కళా వెంకట్రావు హాజరయ్యారు.
News Posted: 2 June, 2009
|