హైదరాబాద్ : ఖైరతాబాద్ లో 19వ ఎడ్యుకేషనల్ మెఘా ఫెయిర్ ను రాష్ట్ర హోం శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొన్ని రోజుల్లో కళాశాలలు ప్రారంభం కానున్న సందర్భంగా కళాశాలల్లో విద్యార్థులకు భద్రత కల్పించడంతో పాటు ర్యాగింగ్ ను నిరోధించేందుకు కళాశాలల యాజమాన్యం కృషి చేయాలన్నారు. ర్యాగింగ్ నిరోధానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆమె కోరారు.