హైదరాబాద్ : తోడపుట్టిన చెల్లిపైనే అదరించాల్సిన అన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధ్యతాయుతంగా ప్రజలను రక్షించే పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్ వేణుగోపాల్ ఆరేళ్లుగా మతి స్థిమితం లేని చెల్లిలిపై అత్యాచారం చేస్తున్నాడు. ఈ దారుణాన్ని తెలిపినా కూతురి మాటలను తల్లి మొదట నమ్మలేదు. కానీ కొన్నాళ్ళకు కొడుకు చేస్తున్న దురాగతాలు కళ్ళబడడంతో పోలీసులకు తల్లి ఫిర్యాదు చేస్తాననడంతో ఆమెపై వేణుగోపాల్ దౌర్జన్యానికి దిగాడు. ఈ అఘాయిత్యాన్ని సహించలేని ఆ తల్లి ఎదురు తిరగటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ ను విచారించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ అధికారులు తెలిపారు.