ఎంసెట్ కు వెబ్ కౌన్సిలింగ్
హైదరాబాద్ : తొలిసారిగా ఎంసెట్ సీట్లను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో జూలై 1 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. జూలై నెలాఖరులోగా కౌన్సిలింగ్ పూర్తి చేసి, ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించకుండా ముందుగానే ర్యాంకులు ప్రకటించే ప్రైవేట్ కళాశాలలపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
News Posted: 4 June, 2009
|