హైదరాబాద్ : అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాయంలో గ్రీన్ ర్యాలీని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్ధులు పాల్గొన్నారు. మరో వైపు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పది ప్రభుత్వ శాఖాల ఆధ్వర్యంలో నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టారు.