హైదరబాద్ : తాళ్ళగడ్డలో ఓ యువతిపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు. తనను ప్రేమించాలంటూ నాలుగు సంవత్సరాలుగా వేదిస్తున్న రాజా... లావణ్య పెళ్ళికి అంగీకరించకపోవడంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న లావణ్యపై ప్రేమోన్మాది బండరాయితో మోదడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. కాగా లావణ్య పరిస్థితివిషంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.