తుపాకీ చూపి బంగారం చోరీ
హైదరాబాద్ : హయత్ నగర్ మండలంలో పట్టపగలే దొంగలు చోరీకి తెగబడ్డారు. బుధవారం నాడు పట్టపగలే లక్ష్మీరెడ్డి పాలెంలోకి చొరబడి తుపాకీ చూపించి ఓ మహిళ నుంచి 25 తులాల బంగారం, నగదు, కిలోవెండి దోచుకుని పరారయ్యారు. ఈ సంఘటనతో స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 10 June, 2009
|