హైదరాబాద్ : నగరంలో మరో మల్టీలెవల్ ఆన్ లైన్ సంస్థ డిపాజిట్ల దార్లను మోసం చేసిన సంఘటన బుధవారం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు కోట్లకు పైగా వసూలు చేసిన ఆర్జెఆర్ ఆన్ లైన్ యాడ్స్ కెంపనీ బోర్డు తిప్పేసింది. కూకట్ పల్లిలోని ఆర్జెఆర్ ఆన్ లైన్ సంస్థ యజమాని యాదగిరి పరారీలో ఉన్నాడు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.