హైదరాబాద్ : హోంశాఖకు మహిళను నియమించిన విధంగానే ఎక్సైజ్ శాఖకు మహిళను నియమిస్తే బాగుంటుందని ప్రజారాజ్యం శాసనసభ్యురాలు వంగా గీత అభిప్రాయపడ్డారు. మహిళలకు భద్రత లేకుండాపోయిన ఈ తరుణంలో హోం శాఖకు మహిళను మంత్రిగా నియమించి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. బెల్ట్ షాపులను నిరోధిచేందుకు ఈ శాఖకు మంత్రిగా మహిళను నియమిస్తే బెల్టు షాపులు మూయించే అవకాశం ఉందని ఆమె అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తూ మంచి చేస్తున్న ముఖ్యమంత్రి బెల్టు షాపులను మూయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.