హైదరాబాద్ : ఓ బ్యాంక్ లో నగదు డిపాజిట్ చేయడానికి వెళ్తున్న ఓ వ్యక్తి నుండి దుండగలు 16 లక్షల నగదును చోరీ చేశారు. దిల్ షుక్ నగర్ లోని శ్రీచైతన్య మార్కెటింగ్ కంపెనీలో సేల్స్ మన్ గాపనిచేస్తున్న రామచంద్రరావు సంతోష్ నగర్ లో ఉన్న అలహాబాద్ బ్యాంక్ కి నగదుతో వెళ్తుండగా కారులో వచ్చిన దుండగులు అతనిని అడ్డగించి నగదు దోచుకెళ్ళారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.