హైదరాబాద్ : ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చినవారు తమపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ నిన్నటి నుంచి గాంధీ ఆసుపత్రిలో జూనయర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె నేడు కూడా కొనసాగుతోంది. దాడి చేసిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లంతా సమ్మె చేస్తారని జూనియర్ డాక్టర్ల సంఘం తేల్చి చెప్పింది. విధుల్లో ఉన్న డాక్టర్లపై దాడులకు పాల్పడితే మూడేళ్ళ జైలు శిక్షతో పాటు జరిమానా విధించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఇటువంటి సంఘటనలు జరగటం బాధాకరమని వారు తమ ఆవేదనను వ్యక్తే చేస్తున్నారు.