హైదరాబాద్ : వేసవి సెలవుల్లో సేదతీరిన పిల్లలు నేడు బడి బాట పట్టారు. వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను నేడు ప్రారంభించారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే పుస్తకాలు కొన్ని మండలాలకే చేరడంతో విద్యార్థులకు పుస్తకాల కొరత మాత్రం తప్పేలా లేదు. కాగా నగరంలోని స్కూల్ బస్సులపై శుక్రవారం రావాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కండిషన్ లో లేని 15 బస్సులను సీజ్ చేసినట్లు జేటీసీ వెంకటేశ్వర్లు తెలిపారు. పాఠశాలలు పున:ప్రారంభైన దృష్ట్యా అన్ని స్కూళ్ళ యాజమాన్యాలు తమ వాహనాలను విధిగా ఫిట్ నెస్ పరీక్షలు జరిపించాల్సిందిగా ఆయన పేర్కొన్నారు.