జీతాలివ్వండి ప్రభో...
హైదరాబాద్ : వేతనాలు ఎప్పుడు చేతికందుతాయోనని 108 సిబ్బంది ఎదురుతెన్నులు చూస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూల ప్రమాదం సంభవించినా వేంటనే స్పందించి వారికి వైద్యసేవలు అందించేందుకు 108 సర్వీసులు ఎంతో సహకరిస్తున్నాయి. కానీ వారికి మాత్రం వేతనాలు దక్కకపోవడంతో 3 వేల మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సత్యం కంపెనీ ప్రభుత్వ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించింది. ఆ కంపెనీలో కుంభకోణం తర్వాత ప్రభుత్వమే ఈ నిర్వహణ బాధ్యతను చేపట్టింది. సత్యంలో ఉన్నప్పుడు ఒకటో తారీకుకే జీతాలు పొందేవారిమనీ వారు తెలిపారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు 108 సర్వీసులను జీవీకే సంస్థకు అప్పగించడంతో వేతనాలు సరిగా అందకపోవడంతో పలు సమస్యలను ఎదుర్కొంటున్నామని, వాటినే వెంటనే పరిష్కరించాలని వారు కోరుకుంటున్నారు.
News Posted: 12 June, 2009
|