లెక్చరర్ల నిరసన
హైదారాబాద్ : ఉన్నత విద్యలో అంతర్భాగంగా ఉన్న ఇంటర్ విద్యను మాధ్యమిక విద్యాశాఖ పరిధిలోకి కలిపి విచ్ఛిన్నం చేయరాదని ఉపాధ్యాయులు, పట్టభద్రులు రాష్ట్ర ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు. ఇంటర్ విద్యకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని పీవీ నరసింహారావు హయాంలో నిర్ణయించగా ప్రస్తుతం అందుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం శోచనీయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇంటర్ విద్యను ప్రాధమిక విద్యలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యను సెకండరీ విద్యలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ వారు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
News Posted: 17 June, 2009
|