నాలుగు కోట్ల అవినీతి చేప
హైదరాబాద్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. ఎపి బీవరేజన్ కార్పోరేషన్ డిఎం సత్యనారాయణ చౌదరి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కూకట్ పల్లిలోని ఆయన ఇంటిపై జరిగిన దాడుల్లో నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు తలెత్తడంతో ఈ దాడులు జరిగాయి. చౌదరి ఇంటిలో ఉన్న రెండు కిలోల వెండి, రూ.2.5 లక్షల నగదు, కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఆయన కార్యాలయంపై కూడా దాడులు చేశారు.
News Posted: 17 June, 2009
|