రైల్వే ట్రాక్ పై ఆర్టీసీ బస్
హైదరాబాద్ : రైల్వే క్రాసింగ్ లో ఆర్టీసీ బస్స్ ఇరుక్కుపోయింది. అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న రైలు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణీకులు ప్రమాదం నుండి గట్కెక్కారు. రాజేంద్రనగర్ మండలం వట్టేపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద చార్మినార్ నుంచి జల్ పల్లి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోయింది. అదే సమయంలో సికింద్రాబాద్ నుండి గుంటూరు ప్యాసింజర్ వస్తోంది. రైల్వే గేట్ మెన్, రైలు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సును ట్రాక్ పై నుంచి కిందకు తరలించటానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో బస్సులో సుమారు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News Posted: 18 June, 2009
|