`చాయ్' మరింత ఘాటు
హైదరాబాద్ : తెల్లారి లేచింది మొదలు నిద్రపోయే వరకు చాయ్ తాగనిదే నగరజీవికి తృప్తి ఉండదు. ఎంత దూరమైన వెళ్ళి చాయ్ ను సేవించేవారు చాలామందే ఉన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపు నిచ్చిన చాయ్ ధర అంతకంతకూ పెరుగుతూ సామాన్యులను కలవరపెడుతోంది. కప్పు పరిమాణం తగ్గి ధర పెరగడంతో చాయ్ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఇరానీ హోటల్ కు వెళ్ళినా `వన్ బై టూ చాయ్', `ఏక్ సింగిల్ చాయ్' అన్న మాటలు వినపడతాయి. నగర ప్రజల జీవనంతో మమేకమైన ఇరానీ చాయ్ ధర పాల ధర పెరిగిన రెండు రోజులకే మరింత వేడెక్కింది. పాల ధర పెరగడంతో హోటళ్ళ నిర్వాహకులు అయిదు రూపాయలున్న కప్పు టీ ధర ఇటీవలే 6 రూపాయలకు పెంచారని, మళ్ళీ టీ ధరను పెంచడం భావ్యం కాదని వారు అంటున్నారు.
News Posted: 18 June, 2009
|